మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2017 (12:55 IST)

అల్లుడి ఆస్తులు రూ.650 కోట్లు.. బహిర్గతం చేసిన ఐటీ అధికారులు

కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు ఆదివారం రాత్రితో ముగిశాయి.

కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఈ తనిఖీల్లో ఏకంగా రూ.650 కోట్ల మేరకు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా? కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అల్లుడే కావడం గమనార్హం. 
 
సిద్ధార్థ కాఫే కాఫీ డేతో పాటు పలు టూరిజం, ఐటీ సంస్థలను నడుపుతున్నారు. నోట్ల రద్దు జరిగిన సమయంలో ఆయా సంస్థల నుంచి పెద్ద ఎత్తున వివిధ బ్యాంకుల్లో సొమ్ములను డిపాజిట్‌ చేసినట్లు ఐటీ అధికారులకు సమాచారం అందింది. దీంతో బెంగళూరు, హాసన్, చిక్‌మగుళూరు, చెన్నై, ముంబైలోని సిద్ధార్థకు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
 
ఈ తనిఖీలపై ఐటీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సిద్ధార్థకు సంబంధించిన కాఫీ టూరిజం, ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ, ఇతర కార్యాలయాల్లో సోదాలు జరిపాం. రూ.650 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించాం. మరిన్ని ఆస్తులు వెలుగు చూసే అవకాశముంద’ని పేర్కొంది. ఐటీ దాడులపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ సీఎం ఎస్ఎం‌.కృష్ణలు మాత్రం ఇంకా స్పందించలేదు. ఇక్కడ విచిత్రమేమిటంటే... ఎస్ఎం.కృష్ణ బీజేపీ నేత కావడం గమనార్హం.