శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 ఏప్రియల్ 2020 (14:15 IST)

జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్ బుక్ రూ.43,574 కోట్ల పెట్టుబడి

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (“రిలయన్స్ ఇండస్ట్రీస్“), జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (“జియో ప్లాట్ ఫామ్స్“), ఫేస్‌బుక్ ఇన్ కార్పొరేషన్ నేడిక్కడ, జియో ప్లాట్ ఫామ్స్‌లో రూ.43, 574 కోట్ల పెట్టుబడికి సంబంధించి బైండింగ్ అగ్రిమెంట్స్ పైన సంతకాలను చేసినట్లుగా ప్రకటించాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌ను రూ.4.62 లక్షల కోట్ల ప్రి-మనీ ఎంటర్ప్రైజ్ విలువైందిగా ఫేస్ బుక్ ఇన్వెస్ట్‌మెంట్ గుర్తించింది. (65.95 బిలియన్ అమెరికన్ డాలర్లు, ఒక డాలర్‌కు రూ.70 చొప్పున). జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఫుల్లీ డయల్యూటెడ్ ప్రాతిపదికన 9.99 శాతం ఈక్విటీ వాటాగా మారనుంది.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్‌ఫామ్స్ రేపటి తరం టెక్నాలజీ కంపెనీ. జియో అగ్రగామి యాప్స్, డిజిటల్ ఎకో సిస్టమ్స్, భారతదేశ నెం.1 హైస్పీడ్ కనెక్టివిటీ వేదికను ఒక్క గొడుగు కిందకు చేర్చడం ద్వారా భారతదేశ డిజిటల్ సొసైటీని నిర్మించనుంది. 388 మిలియన్ చందాదారులకు అనుసంధానత వేదికను అందిస్తున్న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అనేది జియో ప్లాట్‌ఫామ్స్ పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా కొనసాగనుంది.
 
130 కోట్ల మంది భారతీయులకు, భారతీయ సంస్థలకు మరీ ముఖ్యంగా చిన్న వ్యాపారులు, సూక్ష్మ వ్యాపారాలు, రైతులకు డిజిటల్ భారతాన్ని అందించాలన్నది జియో ఆశయం. భారతీయ డిజిటల్ సేవల విభాగంలో జియో పరివర్తనదాయక మార్పులు తీసుకువచ్చింది. అంతర్జాతీయ సాంకేతిక అగ్రగామిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం, ప్రపంచంలోని అగ్రగామి డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశాన్ని ఒకటిగా చేయడంలో కీలకపాత్ర పోషించింది.
 
బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ, స్మార్ట్ డివైజ్‌లు, క్లౌడ్, ఎడ్జ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, అగుమెంటెడ్, మిక్స్‌డ్ రియాల్టీ, బ్లాక్ చెయిన్ వంటి అగ్రగామి సాంకేతిక తలచే శక్తివంతమైన ప్రపంచస్థాయి డిజిటల్ వేదికను జియో నిర్మించింది.
 
ప్రతీ భారతీయుడు కూడా జియో డిజిటల్ లైఫ్‌ను అనుభూతి చెందేలా నెట్‌వర్క్, ఉపకరణాలు, అప్లికేషన్స్, కంటెంట్, సర్వీస్ ఎక్స్‌పీరియెన్సెస్, అందుబాటు టారిఫ్‌లతో కూడిన ఎకో సిస్టమ్‌ను జియో రూపొందించింది. ప్రస్తుత కోవిడ్ -19 సంక్షోభం సందర్భంగా జియో ప్లాట్‌ఫామ్స్ దేశానికి ఆధారపడదగినదిగా ఉంటుంది. దేశానికి ఇది ఇన్‌క్లూజివ్ డిజిటల్ లైఫ్ లైన్.
 
ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటిగా భారతదేశం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్... ఫేస్‌బుక్ యొక్క అత్యంత విరాజిత సమూహాలకు నిలయంగా ఉంది. ఏళ్లుగా ఫేస్ బుక్, భారతీయ ఎంట్రప్రెన్యురియల్ ప్రతిభ, అవకాశంలపై విశ్వాసంతో, తమ బహుళ వేదికలను ఉపయోగించుకుంటూ భారతీయులు, భారతీయ సంస్థలపై అర్థవంతమైన ప్రభావం ఏర్పరచడంలో తోడ్పడేందుకు గాను భారతదేశంలో పెట్టుబడులు పెడుతోంది.
 
ఫేస్ బుక్, జియోల మధ్య భాగస్వామ్యం ఒక విధంగా ఎన్నో రకాలుగా ఇంతకుముందెన్నడూ ఊహించనిది. యావత్ ప్రపంచంలోనే ఓ టెక్నాలజీ కంపెనీ ఒక చిన్న వాటా కోసం భారీమొత్తాన్ని పెట్టుబడిగా పెట్టింది.