బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (19:24 IST)

శబరిమలకు ప్రత్యేక రైళ్లు: డిసెంబర్ 17న ప్రారంభం

శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ - కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి.

డిసెంబర్ 17న సికింద్రాబాద్ నుంచి కొల్లాం స్టేషన్‌కు 07109 నంబర్ గల రైలు బయల్దేరనుంది. 07109 నంబర్ గల రైలుకు రిజర్వేషన్ల ప్రక్రియ డిసెంబర్ 10న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
 
ఈ ప్రత్యేక రైళ్లు చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్‌, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పడి, జోలార్‌పెట్టై, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్‌చెరి, తిరువళ్ల, చెంగనూరు, మావలికర, కయాంకులం స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి.