1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 నవంబరు 2022 (17:14 IST)

ఈపీఎఫ్ఓ చందాదారుల పెన్షన్- రూ.1000 నుండి పెంచే ప్రతిపాదన

epfo
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారుల పెన్షన్ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. నిజానికి పీఎఫ్ చందాదారుల పెన్షన్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఈ విషయంలో కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. 
 
పెన్షన్‌ను నెలకు రూ.1000 నుండి పెంచే ప్రతిపాదన పీఎఫ్‌ చందాదారుల ప్రస్తుత పెన్షన్‌ను నెలకు రూ.1,000 నుండి పెంచే ప్రతిపాదనను కార్మిక మంత్రిత్వ శాఖ అందించింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ కమిటీ ఆర్థిక మంత్రిత్వ శాఖను వివరణ కోరనుంది.