శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (14:09 IST)

అత్యంత సంపన్నుడిగా అవతరించిన ముకేష్ అంబానీ

mukesh ambani
ఫోర్బ్స్ రియల్ టైమ్  బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీని రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ వెనక్కి నెట్టారు. తద్వారా దేశీయ అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీ అవతరించారు. 
 
అదానీ కంపెనీల షేర్లు కొన్ని రోజులుగా హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా నష్టపోతున్న నేపథ్యంలో.. గత నెల క్రితం గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా వున్నారు. 
 
ఆ షేర్లు పడిపోవడంతో ఫోర్బ్స్ తాజా జాబితాలో ముకేష్ అంబానీ 84.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ 10వ స్థానంలో ఉన్నారు.