1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (23:15 IST)

గత 90 రోజులలోనే చిరు వ్యాపార సంస్థలు హైదరాబాద్‌లో 17వేల ఉద్యోగాలను సృష్టించాయి: అప్నా డాట్‌ కో

Jobs
భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ పథంలో ఉంది. గత త్రైమాసంలో ఇది మరింత స్పష్టంగా కనబడటంతో పాటుగా  ప్రొఫెషనల్స్‌కు హైపర్‌ లోకల్‌ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామక ప్రక్రియల పరంగా జోరు కనిపిస్తోంది. హైదరాబాద్‌ అందుకు మినహాయింపేమీ కాదు. ఈ నగరంలో నైపుణ్యవంతులైన అభ్యర్థులకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. భారతదేశంలో అగ్రగామి జాబ్స్‌, ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ అప్నా డాట్‌ కో వెల్లడించే దాని ప్రకారం హైదరాబాద్‌లో గత 90 రోజుల కాలంలో పలు కంపెనీలు కొత్తగా 17వేల ఉద్యోగాలను సృష్టించాయి.
 
అంతేకాదు ఈ నగరంలో 12%కు పైగా నెలవారీ వృద్ధి గత 30 రోజుల కాలంలో జాబ్‌ పోస్ట్స్‌ పరంగా కనిపించింది. వీటిలో అధికశాతం ఉద్యోగాలను చిరు వ్యాపార సంస్థలు అందించాయి. హైదరాబాద్‌లో గత త్రైమాసంలో అత్యధిక డిమాండ్‌ కలిగిన ఉద్యోగాలలో టెలికాలింగ్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, డెలివరీ పర్సన్‌, ఫీల్డ్‌ సేల్స్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, ఎక్కౌంట్స్‌/ఫైనాన్స్‌ వంటివి ఉన్నాయి. గత 90 రోజులలో అప్నా డాట్‌ కోలో ఉద్యోగ అప్లికేషన్‌లు సైతం గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో దాదాపు 23 వేల ఎంప్లాయర్లకు అప్నా ప్రాధాన్యతా వేదికగా నిలుస్తుంది.
 
ఈ వృద్ధి గురించి అప్నా డాట్‌ కో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీస్‌ మానస్‌ సింగ్‌ మాట్లాడుతూ, ‘‘అకస్మాత్తుగా హైదరాబాద్‌లో ఈ వృద్ధి కనిపించడానికి నగరంలో చిరు, మధ్యతరహా వ్యాపారవేత్తలు కారణం. కొవిడ్‌ అనంతర కాలంలో తెలంగాణా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడాన్ని ఇది సూచిస్తోంది’’ అని అన్నారు.