శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (10:16 IST)

కరోనా విజృంభణ.. ఆర్థిక ఇబ్బందులు.. ఈపీఎఫ్ఓ నుంచి గుడ్ న్యూస్

కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్ కారణంగా ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి నెలకొంది. చాలా మంది వైరస్ బారిన పడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తన ఖాతాదారులకు ముందస్తుగానే డబ్బులు ఉపసంహరించుకునే సదుపాయాన్ని కల్పించింది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఖాతాదారులు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా వైద్య ప్రాతిపదికన రుణాలు పొందవచ్చు. 
 
ఈపీఎఫ్‌లో డబ్బులు విత్‌డ్రా చేయాలని అనుకునే ఖాతాదారుడు కచ్చితంగా ఈ ధ్రువపత్రాలు దగ్గర పెట్టుకోవాలి. ఉద్యోగి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఏఎన్) కలిగి ఉండాలి. అలాగే బ్యాంకుకు సంబంధించిన ఖాతా వివరాలు ఈపీఎఫ్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. ఈపీఎఫ్ విత్‌డ్రా డబ్బులు థర్డ్ పార్టీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడం కుదరదు. 
 
ఖాతాదారుడి తండ్రి పేరు, పుట్టిన తేదీ వివరాలు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. డాక్యూమెంట్లను సమర్పించిన తర్వాత ఖాతాదారుడు కరోనా టైంలో 75 శాతం వరకు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీం ద్వారా సుమారు 8 కోట్ల మంది ఉపశమనం కలుగనుంది. ఉద్యోగి తమ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 75 శాతం వరకు డబ్బులు ఉపసహంరిచుకోవచ్చు.
 
ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. వైద్య అత్యవసర పరిస్థితి, గృహ నిర్మాణం లేదా కొనుగోలు, గృహ పునరుద్ధరణ, గృహ రుణం తిరిగి చెల్లించడం, వివాహ అవసరాల కోసం ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. వైద్య ఖర్చుల కోసం డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే.. ఖాతాదారుడు అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. లేదా కోవిడ్ కారణంగా ఖాతాదారుడు, అతడి కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి, పిల్లలు అనారోగ్యానికి గురైతే.. ఖాతాదారులు ఈపీఎఫ్ఓ డబ్బులు మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు.