శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (10:11 IST)

హ్యాపీగా స్టెప్పులేసిన పేటీఎం వ్యవస్థాపకులు

పేటీఎం సంస్థ ఐపీవో ద్వారా రికార్డు స్థాయిలో రూ.16,600 కోట్ల రూపాయలను మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. దీంతో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ ఆనందంతో డ్యాన్స్‌ చేశారు. సెబీ నుంచి అనుమతులు వచ్చాయనే విషయం తెలియగానే సంస్థకు చెందిన ఉద్యోగులతో కలిసి ఆఫీసులో చిందులేశారు.
 
బిగ్‌బి అమితాబ్‌ నటించిన లావారిస్‌ సినిమాలో అప్‌నీతో జైసే తైసే పాటకి లయబద్దంగా నృత్యం చేస్తూ విజయ్‌ శేఖర్‌ శర్మ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వీడియోను మరో పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం విజయ్‌ శేఖర్‌కి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.
 
స్టాక్‌ మార్కెట్‌లో స్టార్టప్‌లు సంచలనం సృష్టిస్తున్నాయి. జోమాటో సృష్టించిన ప్రకంపనలు ఇంకా ఆగకముందే మరోసారి మార్కెట్‌లో అలజడి రేపేందుకు పేటీఎం రెడీ అయ్యింది.