పంజాబ్ నేషనల్ బ్యాంక్: మహిళల కోసమే.. ఆ అకౌంట్ ఓపెన్ చేస్తే?

Punjab National Bank
సెల్వి| Last Updated: శుక్రవారం, 16 అక్టోబరు 2020 (10:35 IST)
Punjab National Bank
దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీబీ) తాజాగా కస్టమర్లకు తీపికబురు చెప్పింది. మహిళల కోసం ప్రత్యేకమైన అకౌంట్ సేవలు ఆవిష్కరించింది. మహిళల కోసం పవర్ సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఖాతాల ద్వారా మహిళలకు ఎన్నో సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ కొత్త సర్వీసులను ప్రకటించింది. పీఎన్‌బీ పవర్ సేవింగ్స్ అనేది ప్రత్యేకమైన స్కీమ్. ఇది మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. అయితే తొలి పేరు మాత్రం మహిళలదే అయ్యి ఉండాలని పీఎన్‌బీ ట్వీట్ చేసింది.

గ్రామాల్లో ఉండే మహిళలు రూ.500 చెల్లించి ఈ ఖాతా తెరవొచ్చు. అదే పాక్షిక పట్టణాల్లో ఉంటే రూ.1,000.. ఇక పట్టణాలు, ఇతర నగరాల్లో నివాసం ఉండే వారు రూ.2,000 చెల్లించి ఈ ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ తెరవడం వల్ల పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు.

ఎలాగంటే? ఖాతా తెరిచిన మహిళలకు 50 పేజీల చెక్ బుక్ ఉచితంగా అందిస్తారు. నెఫ్ట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీసులు ఫ్రీగానే లభిస్తాయి. బ్యాంక్ నుంచి ప్లాటినం డెబిట్ కార్డు ఉచితంగా వస్తుంది. ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఫ్రీ. రోజుకు అకౌంట్ నుంచి రూ.50,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇకపోతే అకౌంట్ కలిగిన వారికి రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది.దీనిపై మరింత చదవండి :