సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:11 IST)

కొత్త రూ.20 నోటు ఇదేనండి.. ఓ సారి చూడండి..

భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త 20 రూపాయల నోటును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ నోటుపై కొత్త ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది. ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ నోటు ముందుభాగంలో గాంధీ బొమ్మ, అశోకుడి స్థూపం ఉన్నాయి. నోటు వెనుకభాగంలో ఎల్లోరా గుహల బొమ్మ ఉంటుంది.
 
ఆ పక్కనే గాంధీ కళ్లద్దాల్లో స్వచ్ఛ భారత్ అనే చిహ్నం ఉంది. నోటు వెనుకభాగం ఎడమవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది. ఈ నోటు తయారీ ప్రారంభమైయిందని, త్వరలోనే మార్కెట్‌లోకి ఈ నోటుని విడుదల చేయబోతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కాగా కొత్త 20 రూపాయల నోటు వచ్చినప్పటికీ, పాత నోట్లు చెలామణిలో ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.