బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (13:06 IST)

పాత రూ.100 నోటు చెల్లదట... ఏప్రిల్ నుంచి కొత్త నోటు...

దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత యేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపింది.

దేశంలో చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ గత యేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపింది. ఈ పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొన్ని నెలల సమయం పట్టింది. ఇప్పటికే దేశంలో ద్రవ్యకొరత కారణంగా ఆర్థిక మందగమనం ఏర్పడివుందని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న వంద రూపాయి నోట్లను పూర్తిగా రద్దు చేయనుంది. దాని స్థానంలో కొత్త రూపాయి నోటను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. 
 
ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన కొత్త 200 రూపాయల నోట్లను వచ్చే యేడాది మార్చి కల్లా మార్కెట్లోకి పూర్తిగా ప్రవేశ పెట్టి, ఆ తర్వాత కొత్త వంద రూపాయల నోట్ల ముద్రను ప్రారంభించాలని భావిస్తోంది. 
 
నోటు సైజులో మార్పు లేకుండా పాత నోటు సైజులోనే కొత్తవాటిని ముద్రించాలని అధికారులు నిర్ణయించినట్టు ఆర్బీఐ తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త వంద రూపాయల నోటు ముద్రణ జరుగుతుందని వెల్లడించింది.