శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

హోటల్ రంగంపై కన్నేసిన రిలయన్స్ - ముకేశ్ చేతికి న్యూయార్క్ హోటల్

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ హోటల్ రంగంపై కన్నేశారు. ఆయన అనుకున్నదే తడవుగా న్యూయార్క్‌లోని మాండరీన్ ఒరియంటల్ హోటల్‌ను కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు ఒప్పందం 736 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
 
గత యేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ హోటల్ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఫలితంగా గత యేడాది యూకేలని స్టాక్ పార్క్ లిమిటెడ్‌లు దక్కించుకుంది. తాజాగా న్యూయార్క్‌లో ప్రీమియర్ లగ్జరీ హోటల్‌గా ఉన్న మాండరీన్ ఒరియంటల్‌ను కొనుగోలు చేసింది. 
 
ప్రస్తుతం ఈ హోటల్ న్యూయార్క్ 80 కొలంబస్ సర్కిల్ ప్రాంతంలో ఉంది. దీన్ని గత 2003లో నిర్మించారు. ఇపుడు ఈ హోటల్‌ను రిలయన్స్ అనుబంధ విభాగమైన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) ద్వారా సొంతం చేసుకుంది.