గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 8 ఆగస్టు 2024 (20:50 IST)

మిడ్ నైట్ సేల్ తీసుకువచ్చిన ఇనార్బిట్ మాల్ సైబరాబాద్

Inorbit Mall
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Inorbit Night out ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో ఆగస్ట్ 9 నుండి 11వ తేదీ వరకు జరుగనుంది. తాము ఇష్టపడే  బ్రాండ్‌ల నుండి 70% వరకు తగ్గింపుతో ప్రత్యేకమైన ఆఫర్‌లను వినియోగదారులు అన్వేషించవచ్చు, అదే సమయంలో అర్ధరాత్రి 12:30 గంటల వరకు షాపింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇది మాత్రమే కాదు, మాల్ వినోదాత్మక కార్యక్రమాలను కూడా ఈ కాలంలో నిర్వహించబోతుంది. 
 
షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్, మార్క్స్ అండ్ స్పెన్సర్, రేర్ రాబిట్, ట్రూ రిలిజియన్, పాంటలూన్స్, మ్యాక్స్, అమెరికన్ ఈగిల్, లెవీస్, వెరో మోడా, టామీ హిల్‌ఫిగర్, రోస్సో బ్రూనెల్లో, వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుండి ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఆగస్ట్ 9న, ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ రోహిత్ స్వైన్ ప్రేక్షకులను ఆనందోత్సాహాలలో తెలియాడించటానికి సిద్ధంగా ఉన్నాడు, ఆగస్టు 10న ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ రాక్ బ్యాండ్ బ్యాండ్ పనాహ్ సంగీత ప్రదర్శన ఉంటుంది. ఆగస్టు 11న ప్రఖ్యాత సితార్ వాద్యకారుడు స్వయం సిద్ధ ప్రియదర్శి, ఒక DJ మధ్య చాలా ఆసక్తికరమైన మ్యూజికల్ ఫ్యూజన్ ఉంటుంది. ఈ ఈవెంట్‌లన్నీ ప్రతి రోజు రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతాయి.
 
అర్ధరాత్రి విక్రయాలతో పాటు, భారతదేశపు అత్యుత్తమ క్రాఫ్ట్-ఆధారిత డిజైన్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బ్రాండ్ జైపోర్, జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7 నుండి 10వ తేదీ వరకు మాల్ సెంట్రల్ ఆట్రియంలో ప్రత్యేక పాప్-అప్‌ను నిర్వహిస్తుంది.