గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 డిశెంబరు 2021 (22:40 IST)

4గిగా వాట్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు విరిడిస్‌ డాట్‌ ఐక్యుతో ఎస్‌ఎస్‌ఈఎల్‌ భాగస్వామ్యం

అత్యున్నత సామర్థ్యం కలిగిన సోలార్‌ పీవీ మాడ్యుల్స్‌ కోసం ఐఆర్‌ఈడీఏ ఆహ్వానించిన బిడ్స్‌ను విజయవంతంగా సొంతం చేసుకున్న బిడ్డర్లలో ఒకరిగా నిలిచిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌ ఎస్‌ఈఎల్‌) జర్మనీకి చెందిన ఇంజినీరింగ్‌ మరియు కన్సల్టింగ్‌ సర్వీస్‌ సంస్ధ విరిడిస్‌ డాట్‌ ఐక్యు జీఎంబీహెచ్‌తో అవగాహన ఒప్పందం చేసుకోవడం ద్వారా మరోమారు అత్యంత కీలకమైన మైలురాయిని చేరుకుంది. పాలీసిలికాన్‌+ఇన్గాట్‌ వాఫర్‌+సెల్‌+మాడ్యుల్‌ కోసం 4 గిగా వాట్ల తయారీ కేంద్ర ఏర్పాటులో ఎస్‌ఎస్‌ఈఎల్‌కు విరిడిస్‌ తోడ్పడనుంది. జర్మనీలో భారతీయ రాయబారి హిజ్‌ ఎక్స్‌లెన్సీ శ్రీ పి హరీష్‌ సమక్షంలో ఎంఓయు జరిగింది.
 
ఈ ప్రాజెక్ట్‌ దశలవారీగా ఆరంభం కానుంది. తొలిదశలో ఎస్‌ఎస్‌ఈఎల్‌ మరియు విరిడిస్‌డాట్‌ ఐక్యు జీఎంబీహెచ్‌‌లు డిజైన్‌ను రూపొందించడంతో పాటుగా ప్రాజెక్ట్‌ ఆరంభానికి తగిన వ్యాపార ప్రణాళికను తీర్చిద్దినున్నారు. ఆ తరువాత విరిడిస్‌ డాట్‌ ఐక్యు జీఎంబీహెచ్‌ అవసరమైన సాంకేతిక/ఇంజినీరింగ్‌ మద్దతును విస్తరిస్తుంది. దీనిని అనుసరించి నిర్మాణ మరియు నిర్వహణ కార్యక్రమాలను ఆరంభిస్తుంది. ఈ కార్యకలాపాలను ఆరంభించిన తరువాత, ఈ ప్రాజెక్టుకు విరిడిస్‌ డాట్‌ ఐక్యు జీఎంబీహెచ్‌ ఒక సంవత్సరం పాటు కార్యకలాపాల నిర్వహణలోనూ మద్దతునందిస్తుంది.
 
ట్రాన్స్‌మిషన్‌ మరియు డిస్ట్రిబ్యూషన్‌ రంగం మరియు ట్రాన్స్‌ఫార్మర్‌ తయారీ రంగంలో అగ్రగామి సంస్థలలో ఒకటిగా వెలుగొందుతున్న షిర్దీ సాయి ఎలక్ట్రికల్స్‌‌కు 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఈ రంగాలలో ఉంది. మెటలార్జికల్‌ సిలికాన్‌, పాలీసిలికాన్‌, ఇన్గోటింగ్‌, వాఫరింగ్‌, సోలార్‌ సెల్‌ మాడ్యుల్స్‌ సహా సిలికాన్‌ ఆధారిత వాల్యూ చైన్‌లో  వినూత్నమైన నైపుణ్యం కలిగిన సంస్థ విరిడిస్‌ డాట్‌ ఐక్యు.
 
ఎస్‌ఎస్‌ఈఎల్‌ సీఈఓ శ్రీ శరత్‌ చంద్ర మాట్లాడుతూ భారతదేశంలో పీవీ వాల్యూచైన్‌లో అతిపెద్ద ఉత్పత్తి సదుపాయాన్ని ఏర్పాటుచేయాలన్న ఎస్‌ఎస్‌ఈఎల్‌‌ను ఈ భాగస్వామ్యం బలోపేతం చేయనుందన్నారు. ఈ భాగస్వామ్యంతో ఎస్‌ఎస్‌ఈఎల్‌, ప్రపంచ శ్రేణి సోలార్‌ సెల్స్‌ మరియు మాడ్యుల్స్‌ను ఉత్పత్తి చేయడంతో పాటుగా ఒకే సమయంలో దేశీయ, విదేశీ మార్కెట్లకు సైతం తోడ్పాటునందించనుందన్నారు.
 
విరిడిస్‌ డాట్‌ ఐక్యు జీఎంబీహెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీ వోల్ఫ్‌గ్యాంగ్‌ హెర్బ్‌స్త్‌ మాట్లాడుతూ ఎస్‌ఎస్‌ఈఎల్‌తో భాగస్వామ్యంతో  అభివృద్ధి చెందుతున్న భారతదేశపు మార్కెట్‌లో ప్రవేశించే అవకాశం దక్కంది. ఈ భాగస్వామ్యంతో రెండు దేశాల నడుమ వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయన్నారు.