మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (12:55 IST)

ప్యాకేజ్ ఫుడ్.. ఆలూ చిప్స్.. స్టాక్ మార్కెట్లో మంచి డిమాండ్

స్టాక్ మార్కెట్లలో ప్యాకేజ్ ఫుడ్ కంపెనీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా ప్యాకేజ్‌ ఫుడ్‌కు ఆదరణ పెరుగుతోంది. జనం ఇళ్లకే పరిమితం అవ్వడంతో, ఎక్కువగా ప్యాకేజీ ఫుడ్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ రంగంలోని పలు కంపెనీలకు లాభాలు వస్తున్నాయి. తాజాగా ఫుడ్‌ కంపెనీలు హిందుస్తాన్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌, డీఎఫ్‌ఎం ఫుడ్స్‌ లిమిటెడ్‌ మదుపరులకు మంచి లాభాలను పంచిపెడుతున్నాయి. 
 
ఈ వారంతంలో ఈ రెండు కంపెనీలు కూడా మంచి లాభాలను నమోదు చేసుకున్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో హిందుస్తాన్‌ ఫుడ్స్‌ చక్కటి ఫలితాలు సాధించింది. హిందుస్తాన్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ శుక్రవారం వరుసగా మూడో రోజు హిందుస్తాన్‌ ఫుడ్స్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ నెలకొంది.
 
ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌ విభాగంలో క్రాక్స్‌, కర్ల్స్‌, నట్‌ఖట్‌ తదితర బ్రాండ్లు కలిగిన డీఎఫ్‌ఎం ఫుడ్స్‌ కౌంటర్‌ శుక్రవారం వరుసగా నాలుగో రోజూ వెలుగులో నిలిచింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు ఏడు శాతం జంప్‌చేసింది. ప్రధానంగా హిందుస్తాన్‌ యూనిలీవవర్‌, పెప్సీ కో తదితర ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో ప్రొడక్టులను తయారు చేసి విక్రయిస్తుంటుంది.