శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (12:29 IST)

చైనా సర్కారు అంత పనిచేసిందా? కరోనా పేరిట మహిళలను వివస్త్రగా..?

చైనా సర్కారు కరోనా విషయంలో అనుసరించిన విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న వుహాన్, హుబి ప్రావిన్స్‌లో నిబంధనలు అమలు చేసినప్పటికీ కఠినంగా అమలు చేయలేదని జిన్జియాంగ్ ప్రజలు చెప్తున్నారు. జిన్జియాంగ్‌లో కేవలం 826 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తక్కువ కేసులు నమోదయినప్పటికి అక్కడ లాక్ డౌన్ నిబంధనలకు కఠినంగా అమలు చేసింది చైనా. 
 
40 రోజులపాటు ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఏవిధంగా అంటే.. ఎలాంటి కారణాలు లేకపోయినా ప్రజలను, మహిళలను అరెస్టులు చేసి చిన్న చిన్న జైల్లో ఉంచేవారని, వారానికి ఒకసారి మహిళను ఓపెన్ గ్రౌండ్‌కు తీసుకెళ్లి అక్కడ వివస్త్రలను చేసి జెర్మీసైడల్ రసాయనాలను పిచికారీ చేసేవారని, దారుణమైన చిత్రహింసలు పెట్టారని జిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ పేర్కొంది. 
 
ఈ ప్రాంతం ప్రజలపై ప్రభుత్వం ఇంతటి కఠినంగా నిబంధనలు అమలు చేయడానికి కారణం లేకపోలేదు. వాయువ్య జిన్జియాంగ్ ప్రాంతంలో ఉయిగర్ ముస్లింల జనాభా అధికంగా ఉన్నది. ఉయిగర్ ముస్లిం జనాభాను అణిచివేసేందుకు చైనా సర్కార్ కరోనా లాక్ డౌన్‌ను వినియోగించుకున్నట్టు బాధలు అనుభవించిన మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.