గురువారం, 9 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 సెప్టెంబరు 2025 (19:02 IST)

ఈ పండగ సీజన్లో రైలులో ఆహారం కోసం కొత్త ఫీచర్లను ప్రారంభించిన స్విగ్గీ

Food
బెంగళూరు: స్విగ్గీ భారతదేశపు ప్రముఖ ఆన్ డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్‌ఫాం రైలులో ఆహారం సేవల కోసం కొత్త ఫీచర్లను ఈరోజు ప్రకటించింది. పండగ సీజన్లో, స్విగ్గీ తెలివైన, మరింత వ్యక్తిగత మెనూ ఎంపికలను ప్రారంభించింది, భారతదేశంవ్యాప్తంగా లక్షలాది రైలు ప్రయాణికులకు ఉత్తేజభరితమైన కొత్త వంటకాల అనుభవాన్ని తీసుకువస్తోంది. వారు స్టేషన్లలో పేరెన్నికగన్న ఈటరీస్ యొక్క ప్రత్యేకమైన జాబితా నుండి తయారైన సిటీ బెస్ట్ వంటకాల శ్రేణి నుండి ఎంచుకోవచ్చు. ఇంకా, రైలులో ఇబ్బంది లేని  భోజన అనుభవాన్ని నిర్థారించడానికి స్విగ్గీ ఈజీ ఈట్స్‌ను కూడా ప్రారంభించింది. స్విగ్గీ వారి ఈజీ ఈట్స్ ఎంపిక ప్రత్యేకంగా రైలులో భోజన అనుభవం కోసం ఎంపిక చేయబడింది. సలాద్ వంటి ఆరోగ్యకరమైన ఆహారం నుండి ఫ్రైస్, నాచోస్ వంటి ఫన్ మంచీస్ వరకు ఈ భోజనం చక్కని, సౌకర్యవంతమైన ప్యాకేజింగ్‌లో హామీ ఇవ్వబడిన కట్లరీ కిట్‌తో లభిస్తుంది.
 
ఈ పండగ సీజన్లో, రైలు ప్రయాణికులు 5,000 వంటకాల రకం నుండి తమ సరైన ఆహారాన్ని ఎంచుకోవచ్చు మరియు 115+ స్టేషన్ల నుండి రైలులో తమ సీటు వద్దకు వాటిని డెలివరీ చేయించుకోవచ్చు. అహ్మదాబాద్‌లో సంప్రదాయబద్ధమైన థాలీ కావచ్చు లేదా పశ్చిమ బెంగాల్‌లో రుచికరమైన సముద్ర ఆహారం కూర కావచ్చు, ప్రయాణికుల రైలు సీటు వద్దకు నేరుగా భారతదేశపు ఉత్తమమైన స్థానిక రుచులను మేము తీసుకువస్తున్నాం.
 
పండగ సీజన్లో ప్రారంభించిన కొత్త ఫీచర్లపై వ్యాఖ్యానిస్తూ, శ్రీ. దీపక్ మలూ, విపి-ఫుడ్ స్ట్రాటజీ, కస్టమర్ ఎక్స్ పీరియెన్స్- న్యూ ఇనీషియేటివ్స్, స్విగ్గీ, ఇలా అన్నారు, మా కస్టమర్లు కోరుకున్నది మేము విన్నాము. ప్రతి ప్రయాణం రుచికరమైన, సౌకర్యవంతమైన, నిజమైన ప్రత్యేకతను చేయడానికి రూపొందించబడిన తెలివైన, మరింత వ్యక్తిగత భోజన ఎంపికలను ప్రారంభించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము.

సిటీ బెస్ట్‌తో, మేము ఆర్డరింగ్ నుండి ఊహించిన పనిని తొలగించాము, కాబట్టి ప్రయాణికులు తమ అద్భుతమైన ఆహారం, పరిశుభ్రత- ఉదారమైన భాగాలకు ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ భాగస్వాముల నుండి విశ్వశనీయమైన, అధిక నాణ్యత గల భోజన ఎంపికలను సులభంగా కనుగొనవచ్చు. అదేవిధంగా, ఈజీ ఈట్స్‌తో, ప్రయాణంలో గందరగోళపరిచే, అసౌకర్యమైన భోజనాల సమస్యని మేము పరిష్కరిస్తున్నాం. మా స్వచ్ఛమైన శాకాహారం విభాగం శాకాహార ప్రయాణికులకు మనశ్సాంతిని ఇస్తుంది. మొత్తంగా, మన అందరికీ తెలిసిన ఆసక్తికరమైనది మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం: ప్రయాణం గమ్యస్థానం అంత ప్రధానమైనది.