గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 30 ఆగస్టు 2021 (19:02 IST)

తమ లాయల్టీ సభ్యత్వ కార్యక్రమ నూతన గుర్తింపు: హార్బర్‌ క్లబ్‌ను ప్రకటించిన వరుణ్‌ గ్రూప్‌

ఆంధ్రప్రదేశ్‌లోని వరుణ్‌ గ్రూప్‌, రాష్ట్రంలో తమ నాలుగు హోటల్స్‌ అందించే అసాధారణ ఆతిథ్యంను అన్వేషించాల్సిందిగా అతిథులను ఆహ్వానిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నాలుగు హోటల్స్‌- నోవోటెల్‌ విశాఖపట్నం, వరుణ్‌ బీచ్‌; ద భీమిలీ రిసార్ట్‌ మేనేజ్డ్‌ బై ఎకార్‌, నోవోటెల్‌ విజయవాడ వరుణ్‌ మరియు తాజ్‌ గేట్‌వే. దశాబ్ద కాల అనుభవం కలిగిన ఈ ఆతిథ్య గ్రూప్‌ ఇటీవలనే పరిమిత మరియు ప్రత్యేకమైన సభ్యత్వ కార్యక్రమాన్ని హార్బర్‌ క్లబ్‌ శీర్షికన ప్రకటించింది.
 
హార్బర్‌ క్లబ్‌తో, నమోదిత సభ్యులు ఈ నాలుగు హోటల్స్‌ వ్యాప్తంగా పలు ఉత్సాహపూరితమైన ప్రయోజనాలను పొందగలరు. నోవోటెల్‌ విశాఖపట్నం మరియు తాజ్‌ గేట్‌వే వద్ద నుంచి బంగాళాఖాతపు తీరపు అందాలను ఆస్వాదించడం; భీమిలీ రిసార్ట్‌లోని ఆయుర్‌ బే స్పా వద్ద పునరుత్తేజపు అనుభవాలను సొంతం చేసుకోవడం లేదా నోవోటెల్‌ విజయవాడ వద్ద జిహ్వను తట్టిలేపే కలినరీ యాత్ర చేయడం, ఏదైనా సరే ఈ సభ్యత్వ కార్యక్రమం తమ సభ్యులకు సాటిలేని అనుభవాలను  ప్రత్యేక రాయితీ ప్రయోజనాలతో అందిస్తుంది.
 
ఈ సభ్వత్యంతో ఈ దిగువ ప్రయోజనాలను పొందవచ్చు:
 
1. నోవోటెల్‌ విశాఖపట్నం వద్ద హార్బర్‌ వ్యు; నోవోటెల్‌ విజయవాడలోని గౌర్మెట్‌ బార్‌; భీమిలీ రిసార్ట్‌లోని వాటర్‌ బార్‌ మరియు గేట్‌వే తాజ్‌ వైజాగ్‌ వద్ద లాసన్స్‌ లాంజ్‌ వద్ద ఫుడ్‌ అండ్‌ బేవరేజస్‌పై 35% రాయితీని గరిష్టంగా ఆరుగురుకి మరియు అంతకు మించిన గ్రూప్‌లపై 25% రాయితీని పొందవచ్చు.
 
2. అన్ని ఎఫ్‌ అండ్‌ బీ ఔట్‌లెట్ల వద్ద 20% రాయితీ
 
3. హెల్త్‌ క్లబ్‌ వార్షిక సభ్యత్వం వద్ద 30% రాయితీ
 
4. భీమిలీ ఆయుర్‌ బే వెల్‌నెస్‌ కేంద్రం వద్ద 25% రాయితీ
 
5. కార్పోరేట్‌ బాంక్విట్‌ ఈవెంట్లపై 15% రాయితీ
 
6. ప్రచురిత రూమ్‌ టారిఫ్‌పై 15% రాయితీ పొందవచ్చు.
 
పైన పేర్కొనబడిన సభ్యత్వ ధర 10000 రూపాయలు + పన్నులు ఒక సంవత్సరం కోసం కాగా; 15వేల రూపాయలు+ పన్నులను రెండు సంవత్సరాల సభ్యత్వం కోసం చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యం కాక మునుపే, సైనప్‌ చేయండి, ఒక్కసారి మాత్రమే అన్నట్లుగా లభించే సభ్యత్వ ఆఫర్‌ ప్రయోజనాలను అందుకోండి.