ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (10:09 IST)

మళ్లీ పెరిగిన బంగారు వెండి ధరలు

gold
బులియన్ మార్కెట్‌లో మళ్లీ పసిడి ధరలు భగ్గుమన్నాయి. కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఈ ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.400, 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.440 చొప్పున ధర పెరిగింది. 
 
దేశీయంగా వెండి ధర రూ.59000గా ఉంది. కిలో వెండిపై రూ.1600 మేరకు పెరిగింది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం. 
 
హైదారబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
 
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48100గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52470గా ఉంది. 
 
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.4900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52310గా ఉంది. 
 
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52360గా ఉంది.