బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మే 2023 (12:03 IST)

భయపెడుతున్న కందిపప్పు ధరలు

Toor Dal
కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. అకాల వర్షాలు కూడా కందిపప్పు కొరతకు కారణంగా చెబుతున్నారు. దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. డిమాండ్ పెరుగడంతో రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం రూ. 140కి పెరిగిన ధర రూ.180 వరకు చేరే అవకాశం వుందని చెప్తున్నారు. 
 
వేసవిలో కందిపప్పు వినియోగం కొంత తక్కువగా ఉంటుందని, వచ్చేది వర్షాకాలం కావడంతో పెరిగే అవకాశం ఉందని తెలిపారు. గతేడాది దేశంలో 43.4 లక్షల టన్నుల కందిపప్పును పండించగా, మరో 15 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. అయితే, ఈ ఏడాది మాత్రం దిగుబడి 38.9 లక్షల దాటలేదు.