డిజిటల్ చెల్లింపులలో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ వీసా మరియు నాస్కామ్ ఫౌండేషన్‌లు ఏకతాటి పైకి రావడంతో పాటుగా డిజిటల్ నైపుణ్యాలు, ఆర్ధిక అక్షరాస్యతతో మహిళా వ్యాపారవేత్తల నైపుణ్యాభివృద్ధికి ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీసా ఆరంభించింది.
గత సంవత్సరం 50 మిలియన్ల చిరు, సూక్ష్మ వ్యాపార సంస్థల వృద్ధి కోసం సంస్థ ప్రకటించిన అంతర్జాతీయ రికవరీ ప్రయత్నాలలో ఇది ఓ భాగం. ఈ శిక్షణా కార్యక్రమాన్ని పేదవర్గాలకు చెందిన మహిళలకు సహాయపడే రీతిలో రూపొందించారు. దీనిద్వారా ప్రాధమిక డిజిటల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటుగా తమ వ్యాపార సమర్థతనూ మెరుగుపరుచుకునేందుకు మహిళలకు తోడ్పడనున్నారు.
మహమ్మారి కారణంగా భారతదేశంలో ఎంఎస్‌ఎంఈ రంగం గణనీయంగా ప్రభావితమైంది. 70%కు పైగా మహిళా వ్యాపారవేత్తలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఈ చిరు వ్యాపారవేత్తలకు తమ మద్దతునందించడంతో పాటుగా నైపుణ్యాభివృద్ధి చేయడం కోసం తోడ్పడింది.
ఈ కార్యక్రమ భాగస్వామి నాస్కామ్ ఫౌండేషన్ 650కు పైగా మహిళా సూక్ష్మ వ్యాపారవేత్తలతో కలిసి పనిచేయడంతో పాటుగా వారు ఆన్‌లైన్‌లో వ్యాపార కార్యక్రమాలు సాగించేందుకు సైతం శిక్షణ అందించింది. అదే రీతిలో భారతదేశంలో తమ వ్యాపారాలను పునఃనిర్మించి, విస్తరిస్తుంది. వీసా, గతంలో మహిళలు ప్రారంభించి, నిర్వహిస్తున్న వ్యాపారాలకు గ్రాంట్స్ ప్రోగ్రామ్ ద్వారా ఐఫండ్ ఉమెన్‌తో కలిసి తోడ్పడింది. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా స్థానిక ఆర్టీషియన్ కమ్యూనిటీలను మెరుగుపరచడంతో పాటుగా డిజిటైజ్ చేసేందుకు కృషి చేస్తుంది.
ఈ కార్యక్రమం ద్వారా ప్రభావిత వ్యాపారవేత్తలకు సమ్మిళిత నమూనాతో శిక్షణ అందించడం లక్ష్యంగా చేసుకున్నారు. ఆన్‌లైన్ శిక్షణను డిజిసాక్షర్ పోర్టల్, యాప్ ద్వారా అందించనున్నారు మరియు లబ్ధిదారుందరూ ఒక సంవత్సరం ఇంటర్నెట్ కనెక్టివిటీతో మొబైల్ ఫోన్ అందుకుంటారు. దీనిద్వారా వారు కోర్సు కరిక్యులమ్, శిక్షణను అందుకోగలరు. ఆఫ్‌లైన్ శిక్షణా కార్యక్రమాలను పాలినేట్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. అక్కడ ఈ మహిళా వ్యవస్థాపకులు అత్యుత్తమ ప్రక్రియలను తమ వ్యాపారాల పునఃప్రారంభం, వ్యాప్తి కోసం అందుకుంటారు. అంతేకాదు, తమ వ్యాపారాలను ఆన్‌లైన్‌కు మార్చడం, పన్నుల నిర్వహణ, నగదు రహిత లావాదేవీలను చేయడం, అందుబాటులోని ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలను అందుకోవడం వంటి వాటి పరంగానూ ఇది తోడ్పడుతుంది.
ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా శ్రీ టీఆర్ రామచంద్రన్, గ్రూప్ కంట్రీ మేనేజర్, ఇండియా అండ్ సౌత్ ఆసియా-వీసా మాట్లాడుతూ, తమ వైవిధ్యమైన సామర్థ్యాలను వినియోగించడం ద్వారా డిజిటల్, ఆర్ధిక సమ్మిళితను పేద వర్గాలకు చేరువ చేయడానికి వీసా కట్టుబడి ఉంది. వాణిజ్య పరంగా నమ్మకమైన సంస్థగా, ఈ కార్యక్రమం కోసం నాస్కామ్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. దీని ద్వారా దేశవ్యాప్తంగా సూక్ష్మ వ్యాపార సంస్థలకు అత్యవసర ఆర్థిక సాహిత్యం, నైపుణ్యాన్ని ఈ డిజిటల్ యుగంలో అందించనున్నాం. రాబోయే సంవత్సరాలలో వారి జీవితాలు, వ్యాపారాలను పునర్నిర్మించగలమని మేము ఆశిస్తున్నాము. ఇది పరివర్తక ప్రయాణంగా నిలువడంతో పాటుగా ఈ వ్యాపార వేత్తలకు శక్తివంతమైన మద్దతును సైతం సృష్టించగలదని ఆశిస్తున్నాము అని అన్నారు.
నాస్కామ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా నిలువడంతో పాటుగా తమ పర్యవేక్షణ మరియు మూల్యాంకనం చేపడుతుంది. ఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడంతో పాటుగా భాగస్వాములందరినీ ఏకతాటిపైకి తీసుకువస్తుంది.
తమ లక్ష్యాన్ని నాస్కామ్ ఫౌండేషన్, సీఈవో శ్రీమతి నిధి భాసిన్ వెల్లడిస్తూ, తాజా పీఎల్‌ఎఫ్‌ఎస్ అధ్యయనం (2018) ప్రకారం గ్రామీణ మరియు పట్టణ భారతదేశంలో మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం 18.6%గా ఉంది. ఈ అంతరాలు స్పష్టంగా వెల్లడించే దాని ప్రకారం మహిళా వ్యవస్థాపకత మెరుగుపడటమనేది సమ్మిళిత వృద్ధిని సాధించాలనే భారతదేశపు లక్ష్యం సాకారం కావడంలో మరియు సస్టెయినబల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీలు) చేరుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి ఈ సవాల్‌ను మరింతగా పెంచింది.
కమ్యూనిటీలు కోలుకోవడంలో వెన్నుముకగా మహిళలను తీర్చిదిద్దింది. ఇది మహిళా వ్యవస్థాపకతలోని అవరోధాలను చురుగ్గా గుర్తించి, తొలగించడానికి అనుకూలమైన వాతావరణానికి ఇది పిలుపునిస్తుంది. వీసా భాగస్వామ్యంతో ఈ కార్యక్రమంపై పనిచేస్తున్న సమయంలో మా ప్రధాన లక్ష్యం అదే. ఈ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం ద్వారా కనీసం 650 మంది మహిళలు తమ వ్యాపారాలను పునఃప్రారంభించడంతో పాటుగా తమ వ్యాపారాలను పునర్నిర్మించుకుని, వారి వ్యాపారాలను వ్యాప్తి చేసుకుంటూనే, తమ కమ్యూనిటీలలో రోల్ మోడల్స్‌గా నిలిచి ఇతర మహిళలు తమ సొంత చిరు వ్యాపారాలను ప్రారంభించేందుకు స్ఫూర్తిని కలిగించనున్నారు అని అన్నారు.
డిజిసాక్షర్ పోర్టల్, వీడియో ఆధారిత స్వీయ అభ్యాస నమూనాలు, క్విజ్‌లు, ఎస్సెస్‌మెంట్‌లను ఈ కార్యక్రమమంతటా అభ్యాసానికి తోడ్పాటునందిస్తుంది. ఈ కోర్సు కరిక్యులమ్‌ను స్థానిక భాషలలో అందుబాటులో ఉంచడం వల్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. శిక్షణ తరువాత, ఈ కార్యక్రమం నిధులను సైతం అందిస్తుంది. ఇది మహిళా వ్యాపారవేత్తలకు స్టాక్ కొనుగోలు మద్దతునందించడంతో పాటుగా వారు తమ కార్యకలాపాలను ఆరంభించేందుకు మార్కెట్ లింకేజ్‌లను సైతం సులభతరం చేస్తుంది.