గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 13 ఆగస్టు 2024 (23:18 IST)

ఏపి-తెలంగాణ విద్యార్థుల కోసం టోఫెల్, జీఆర్ఈకు మద్దతు

students
టోఫెల్, జీఆర్ఈ పరీక్షలకు ప్రసిద్ధి చెందిన, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎడ్యుకేషనల్ అసెస్‌మెంట్ ఆర్గనైజేషన్ అయిన ఈటీఎస్ అనుబంధ సంస్థ అయిన ఈటీఎస్ ఇండియా, కన్సార్టియం ఆఫ్ ఫారిన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్(సెఫా)తో పరివర్తనాత్మక భాగస్వామ్యాన్ని చేసుకుంది. టోఫెల్  మరియు జీఆర్ఈ సంసిద్ధతకు తగిన వనరులు, నిపుణుల మార్గదర్శకాలను అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్(ఏపీ), తెలంగాణలోని విద్యార్థులకు మద్దతును గణనీయంగా అందించటం దీని ద్వారా సాధ్యమవుతుంది. 
 
విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న ఏపీ- తెలంగాణలకు చెందిన విద్యార్థులకు సమగ్ర మద్దతును అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా చేసుకుంది. టోఫెల్, జీఆర్ఈ పరీక్ష రిజిస్ట్రేషన్‌లపై గణనీయమైన ఆదా, నిపుణుల సలహా, వ్యక్తిగతీకరించిన కౌన్సెలింగ్ వంటి ప్రయోజనాలు కూడా విద్యార్థులు పొందుతారు. అంతేకాకుండా, వారు టోఫెల్ బిగినర్స్ గైడ్, ప్రాక్టీస్ టెస్ట్‌లు, మరిన్నింటితో సహా అధిక-నాణ్యత ప్రిపరేషన్ మెటీరియల్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. 
 
ఈటీఎస్ ఇండియా, దక్షిణాసియా కంట్రీ మేనేజర్ సచిన్ జైన్ ఈ భాగస్వామ్యం గురించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ  “ఏపీ, తెలంగాణ విద్యార్థులకు మెరుగైన మద్దతునిచ్చేందుకు కన్సార్టియం ఆఫ్ ఫారిన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. విదేశాల్లో చదువుకోవాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు మెరుగైన వనరులు, మార్గదర్శకత్వం అందించడంలో మా నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనం" అని అన్నారు.
 
“ఈటిఎస్ ఇండియాతో భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు బలమైన మద్దతు, వనరులను అందించే మా మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది" అని కన్సార్టియం ఆఫ్ ఫారిన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ (సెఫా ) అధ్యక్షుడు మరియు ప్రతినిధి శేఖర్ భూపతి అన్నారు.