కె-12 విభాగంలో ప్రవేశించిన నూతన స్టార్టప్ ఐ-టెక్
భారతదేశంలో ఆన్‌లైన్ విద్యా విభాగపు విలువ దాదాపు 2 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. విద్యార్థుల నడుమ 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు లక్ష్యంగా చేసుకున్నది నూతన విద్యా విధానం 2020. అయితే బోధించే నైపుణ్యాలకు, నేర్చుకునే అంశాలకు నడుమ భారీ ఖాళీ ఉంది. ఈ ఖాళీని పూరించాలంటే విద్యార్థులకు చిన్నతనం నుంచే సంబంధిత శిక్షణను అందించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యంతోనే ఐయాంట్, 6-12వ తరగతి (సైన్స్, కామర్స్, ఆర్ట్స్ విభాగాలు) విద్యార్థుల కోసం నూరు శాతం ఐటీ నైపుణ్య శిక్షణా వేదికగా ఐ-టెక్‌ను ఆవిష్కరించింది.
కోడింగ్, ఐటీ ఫండమెంటల్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, పైథాన్ మొదలైన సాంకేతిక నైపుణ్య అంశాలతో పాటుగా అభిజ్ఞా అభ్యాసమైనటువంటి మైండ్ మ్యాపింగ్, జనరల్ నాలెడ్జ్ తదితర అంశాలను ఐ-టెక్ కోర్సు మిళితం చేసుకుంది. విద్యార్థుల విద్యలో నూతన కోణాన్ని ఇది జోడించనుంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈతో పాటుగా రాష్ట్ర బోర్డుల విద్యార్థులు ఈ కోర్సులను ఎంచుకోవచ్చు.
ఈ కోర్సు కంటెంట్ పలు నైపుణ్యాలు, విజ్ఞాన అంశాల సమాహారం. భావి అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని తీర్చిదిద్దాము. విజయవంతమైన కెరీర్‌లను పొందడానికి ఈ నైపుణ్యాలను సంతరించుకోవడం అత్యంత కీలకం అని భక్తి ఓజ్మా ఖేర్నానీ, మేనేజింగ్ డైరెక్టర్, ఐయాంట్ అన్నారు.
ఈ ఐ-టెక్ కోర్సులను నాలుగు విభాగాలుగా విభజించారు. ఆరు-ఏడు తరగతుల కోసం జూనియర్; 8-9 తరగతులకు సీనియర్; 10-12 తరగతులకు ఐటెక్ ఎక్స్‌పర్ట్ మరియు 12వ తరగతి పైన వారికి ఐటెక్ సుప్రీమ్ అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను పూర్తిగా ఆన్‌లైన్‌లో బోధిస్తారు. బ్యాచ్‌లు పరిమితంగా ఉంటాయి. విద్యార్థులకు సౌకర్యవంతమైన భాషలో బోధన చేస్తారు.