శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (12:29 IST)

బీవోబీలో 546 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Jobs
బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏకంగా 546 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి కనీస వేతనం రూ.40 వేలుగా అందజేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 14వ తేదీతో గడువు ముగియనుంది.
 
వెల్త్ మేనేజ్‌మెంట‌్‌ను విస్తరించే సేవల్లోల భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్టుల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 546 పోస్టులను భర్తీ చేయనుంది. బ్యాంకు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 500 అక్విజిన్ ఆఫీసర్, 15 ప్రైవేటు బ్యాంకర్ పోస్టులు, 19 వెల్త్ స్ట్రాటజిస్ట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోనున్నారు. ఈ పోస్టులకు రాత పరీక్షను హైదరాబాద్, వైజాగ్ నగరాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.