1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 1 మే 2025 (20:23 IST)

భారతీయ భాషలలో భారతదేశ ప్రపంచ భాషా ప్రయాణాన్ని శక్తివంతం చేసిన డ్యుయోలింగో

ప్రపంచంలోని ప్రముఖ మొబైల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అయిన డ్యుయోలింగో, భారతీయులను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి స్థానికంగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు జరిగిన తన అతిపెద్ద కంటెంట్ విస్తరణలో భాగంగా, డ్యుయోలింగో భారతీయ అభ్యాసకుల కోసం 28 కొత్త కోర్సులను ప్రారంభించింది. దీని ద్వారా స్పానిష్, ఫ్రెంచ్, కొరియన్, జపనీస్, జర్మన్ వంటి ప్రపంచ భాషలను నేరుగా హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు భాషలలో నేర్చుకునే అవకాశం మొదటిసారిగా లభించింది.
 
భారతదేశం అంతటా లక్షలాది మందికి యాక్సెస్‌ను అందించేలా రూపొందించబడిన ఈ విస్తరణ, అడ్డంకులను ఛేదించి, ప్రపంచ సంస్కృతిని అన్వేషించడానికి, కెరీర్ నైపుణ్యాలను పెంచుకోడానికి లేదా సరదాగా నేర్చుకోడానికి ఆసక్తి ఉన్నవారికి విద్య, అవకాశాలకు కొత్త ద్వారాలను తెరుస్తోంది. డ్యుయోలింగో సిగ్నేచర్ గేమిఫైడ్ మోడల్‌పై నిర్మించిన ప్రతి కొత్త కోర్సుతో, ఈ ప్రయోగం భారతదేశంలోని యువత, డిజిటల్-ఫస్ట్ జనాభాకు కొత్త భాషలను నేర్చుకోవడం ఆనందంగా, సంబంధితంగా, సమ్మిళితంగా ఉండేలా చూసుకోవడానికి ఉల్లాసభరితమైన క్యారెక్టర్స్, ఆఫ్‌లైన్ యాక్సెస్‌తో బైట్ సైజ్డ్ పాఠాలను మిళితం చేస్తోంది.
 
‘‘మా ఇండిక్ లాంగ్వేజ్ కోర్సులు ప్రారంభించినప్పటి నుండి, మెట్రోయేతర నగరాల నుండి వారి మాతృభాషలను- ముఖ్యంగా హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ- ఉపయోగించి ఇంగ్లీష్ నేర్చుకోవడం క్రమంగా పెరుగుతోంది’’ అని డ్యుయోలింగో ఇండియా రీజనల్ మార్కెటింగ్ డైరెక్టర్ కరణ్‌దీప్ సింగ్ కపానీ అన్నారు. "మాతృభాషలో నేర్చుకోవడం ప్రారంభమైనప్పుడు భాషా అభ్యాసం ఉత్తమంగా పనిచేస్తుందని ఈ ధోరణి మనకు చూపిస్తుంది. ఈ విస్తరణతో ఈ దృక్పథాన్ని పెంపొందించుకుంటూ, ప్రపంచ భాషల పట్ల భారతదేశం యొక్క పెరుగుతున్న అభిరుచిని తీర్చడమే కాకుండా, సరళంగా, సౌకర్యవంతంగా, వారికి ఇప్పటికే తెలిసిన భారతీయ భాషలలో భారత్ నుండి లక్షలాది మంది నమ్మకంగా ప్రపంచ వేదికపైకి అడుగుపెట్టి ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని కూడా అందిస్తున్నాం’’ అని అన్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా, డ్యుయోలింగో తాజా విస్తరణ దాని మొత్తం కోర్సు ఆఫర్‌లను రెట్టింపు చేస్తుంది. ఇది కంపెనీ చరిత్రలో అతిపెద్ద కంటెంట్ రోల్‌అవుట్‌గా నిలిచింది. జనరేటివ్ ఏఐలో పురోగతి ద్వారా ఈ వేగవంతమైన వృద్ధి సాధ్యమైంది, ఇది డ్యుయోలింగో ఒక సంవత్సరం లోపు దాదాపు 150 కొత్త కోర్సులను సృష్టించడానికి, ప్రారంభించడానికి వీలు కల్పించింది. ఈ ప్రక్రియకు గతంలో ఒక్కో కోర్సుకు సంవత్సరాలు పట్టేది.
 
‘‘మా మొదటి 100 కోర్సులను అభివృద్ధి చేయడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరంలోనే మేం దాదాపు 150 కొత్త కోర్సులను సృష్టించి ప్రారంభించగలుగుతున్నాం. జనరేటివ్ ఏఐ  మా అభ్యాసకులకు ప్రత్యక్షంగా ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ" అని డ్యుయోలింగో సీఈఓ, సహ వ్యవస్థాపకుడు లూయిస్ వాన్ అహ్న్ అన్నారు. "ఇది మా ఏఐ, ఆటోమేషన్ పెట్టు బడుల  అద్భుతమైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది, ఇది మాకు అపూర్వమైన వేగం, నాణ్యతతో వృద్ధి చేయడా నికి వీలు కల్పించింది’’ అని అన్నారు.
 
ఈ కొత్త కోర్సులు ప్రాథమికంగా బిగినర్స్ లెవెల్స్ (CEFR A1-A2)కు మద్దతు ఇస్తాయి. స్టోరీస్ (రీడింగ్ కాంప్రహెన్షన్‌ను అభివృద్ధి చేయడానికి), డ్యూయో రేడియో (లివింగ్ కాంప్రహెన్షన్‌ను అభివృద్ధి చేయడానికి) వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. మరింత అధునాతన కంటెంట్ రాబోతుంది, 2025 వరకు దశలవారీగా వీటిని ప్రవేశపెట్టనున్నారు.