బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (13:36 IST)

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు రిలీజ్ - విజయవాడ విద్యార్థికి ఆరో ర్యాంకు

ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్వాన్స్‌డ్ (జేఈఈ అడ్వాన్స్‌డ్‌) ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. ఐఐటీల్లో బీటెక్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయకు 6వ ర్యాంకు వచ్చింది.
 
ఫలితాలు విడులైన నేపథ్యంలో రేపటి నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. 
 
దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. వీటిలో బాలికలకు 1,567 సీట్లను సూపర్‌ న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యధికంగా 2,129 మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో ఇవి సుమారు 13 శాతం. ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ సీట్లనూ కలిపితే అది 14 శాతానికి పెరుగుతుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.