సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 14 జనవరి 2024 (16:07 IST)

జేఈఈ మెయిన్స్ 2021 సెషన్ 1 బీఆర్క్ పరీక్షకు సిటీ స్లిప్పుల రిలీజ్

students
జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ ఒకటి బీఆర్ పరీక్షకు సంబంధించిన సిటి స్లిప్పుల్ని అధికారిక వెబ్‌సైట్‌లో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ స్లిప్పులను జనవరి రెండో వారంలో విడుదల చేస్తామని టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఆ ప్రకారంగానే ఆదివారం ఈ స్లిప్పులను వెబ్‌సైట్‌‍లో ఉంచింది. జేఈఈ వెబ్‌సైట్ www.jeemain.nta.ac.in అనే వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు. 
 
ఈ సిటి స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సివుంటుంది. ఇందులో అప్లికేషన్ నంబరుతో పాటు పుట్టిన తేదీని ఎంటర్ చేసి సిటీ స్లిప్పును డౌన్‌లోడ్ చేసుకోవచ్చన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇందులో జేఈఈ పరీక్షా కేంద్రాలు ఉన్న నగరాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే, ఇందులో పరీక్ష తేదీ, షిఫ్ట్ టైమింగ్, రిపోర్టింగ్ టైమింగ్, పరీక్ష రోజు పాటించాల్సిన మార్గదర్శకాలు, ఇత సమాచారం ఉంటాయి.