శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 10 ఆగస్టు 2021 (21:31 IST)

బీటెక్, బీబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ఎన్‌యు

అభ్యాసం, పరిశోధన, ఆవిష్కరణ మరియు విజ్ఞాన సమాజానికి స్థిరత్వం తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పడిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 
తమ నాలుగు సంవత్సరాల బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్‌, బయోటెక్నాలజీ, కమ్యూనికేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, డాటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ);  నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ (మార్కెటింగ్‌– మార్కెటింగ్‌ ఎనలిటిక్స్‌, ఎంటర్‌ ప్రిన్యూర్‌షిప్‌, ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫిన్‌టెక్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ మీడియా స్టడీస్‌, డిజిటల్‌ అండ్‌ సోషల్‌ మీడియా మార్కెటింగ్‌), మూడు సంవత్సరాల బీబీఏ(ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, భీమా, డిజిటల్‌ మార్కెటింగ్‌, బిజినెస్‌ ఎనలిటిక్స్‌, ఫ్యామిలీ మేనేజ్డ్‌ బిజినెస్‌)లో ప్రవేశాల కోసం ఆహ్వానిస్తుంది.
 
ఈ ప్రోగ్రామ్‌లలో దరఖాస్తు చేసేందుకు niituniversity.in. చూడవచ్చు. నేటి కాలంలో విద్యార్ధులు విజయవంతంగా కెరీర్‌లను నిర్మించుకునే రీతిలో ఎన్‌యు కరిక్యులమ్‌ రూపొందించారు. ఆరంభం నాటి నుంచి ఈ యూనివర్శిటీ 100% ప్లేస్‌మెంట్‌లను విద్యార్థులకు అందించింది. గత సంవత్సరం అత్యధికంగా 25లక్షల రూపాయల సీటీసీతో నియామకాలు ఇక్కడ జరిగాయి.
 
నిట్‌ యూనివర్శిటీ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ పరిమల్‌ మండ్కే మాట్లాడుతూ, ‘‘విద్యా సంస్థలతో పాటుగా పరిశ్రమలు సహకరించుకుంటూ పనిచేయాలనే గట్టి నమ్మకంతో, మేము పరిశ్రమకు అనుకూలమైన విద్యను ఆరంభం నాటి నుంచి అందిస్తుండటంతో పాటుగా మా విద్యార్థులు విజయవంతమైన కెరీర్స్‌ను మారుతున్న ఆర్ధిక వ్యవస్థలో పొందేందుకు సహాయపడుతున్నాం.

మేము ప్రతి విద్యార్థికీ పరిశ్రమ ఇంటర్నెషిప్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తద్వారా వారు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తూనే వాస్తవ ప్రపంచపు కార్యకలాపాలను గురించి తెలుసుకోగలుగుతారు. పరిశ్రమలో అత్యుత్తమ సంస్థలు మా ప్లేస్‌మెంట్‌ భాగస్వాములుగా వెలుగొందుతున్నాయి’’ అని అన్నారు.
 
ఎన్‌యు అడ్మిషన్స్‌ ఇంటరాక్షన్‌ ప్రాసెస్‌ (ఏఐపీ)ను ఇప్పుడు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. దీనిద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అత్యంత సురక్షితంగా తమ ఇంటి వద్ద నుంచే ప్రవేశాలను పొందేందుకు ఇది సహాయపడుతుంది.