గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (15:36 IST)

యూపీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేషన్.. 35 పోస్టులు..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-(యూపీఎస్సీ) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హోమ్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖతో పాటు పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 35 పోస్టుల్ని ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 10 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేలు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 35.
 
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 10
 
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ లేదా రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ
 
స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ), కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ- 24
రీసెర్చ్ ఆఫీసర్ (సోషల్ స్టడీస్), కేంద్ర హోం శాఖ- 1 సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (లై-డిటెక్షన్), ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ- 3
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (హోమియోపతి), డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్- 7.