సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (14:30 IST)

ఇస్రోలో 189 ఖాళీ ఉద్యోగాలు.. మార్చి 6 చివరి తేదీ

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పలు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ముఖ్యంగా, బెంగుళూరులోని ఇస్రోలోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది. మొత్తం ఖాళీలు 189 ఉండగా, వీటికోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 6గా నిర్ణయించగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు... టెక్నీషియన్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, హిందీ టైపిస్ట్‌, కుక్‌, ఫైర్‌మెన్‌ తదితరాలు. 
 
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌-మెకానిక్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రోప్లేటింగ్‌, మెకానికల్‌ తదితరాలు.
 
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్‌), డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, అనుభవం.
 
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇస్రో వెబ్‌సైట్‌ను చూడొచ్చు.