చికెన్ మంచూరియన్ ఎలా చేయాలో తెలుసా?

Selvi| Last Updated: సోమవారం, 27 అక్టోబరు 2014 (15:17 IST)
చికెన్ బరువును నియంత్రిస్తుందట. లో క్యాలరీలను కలిగివుండే చికెన్‌లో హై ప్రోటీన్స్ ఉన్నాయి. అయినప్పటికీ వెయిట్ మెయింటెనెన్స్‌లో చికెన్ అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి చికెన్‌తో గ్రేవీలు, ఫ్రైలు కాకుండా చైనీస్ చికెన్ మంచూరియన్ తయారు చేసి చూడండి. చైనీస్ చికెన్ మంచూరియన్ ఇంట్లో తయారుచేసుకోవచ్చు. చికెన్ మంచూరియన్ ఎలా చేయాలంటే..?

కావలసిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్ : అరకేజీ
కార్న్: ఒక కప్పు
కోడిగుడ్లు : 2
వెల్లుల్లి రెబ్బలు తరుగు :
రెండు టీ స్పూన్లు
అల్లం పేస్ట్ : ఒక టీ స్పూన్
క్యాప్సికమ్ తరుగు : ఒక కప్పు
కొత్తిమీర తరుగు: రెండు టేబుల్ స్పూన్లు
అజినోమోటో: అర టీస్పూన్
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి తరుగు : రెండు టీ. స్పూన్లు
సోయా సాస్: 3టేబుల్ స్పూన్లు
టమోటో సాస్: 2 టేబుల్ స్పూన్లు
అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్

తయారీ విధానం :


ముందుగా ఒక బౌల్‌లో కార్న్ ఫ్లోర్, గుడ్డు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే గోరువెచ్చని నీరు పోసి బాగా కలుపుకోవాలి.
తర్వాత డీప్ బాటమ్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.

ఇప్పుడు చికెన్ ముక్కలు తీసుకొని ముందుగా కలిపి పెట్టుకొన్న పిండిలో డిప్ చేసి కాగే నూనెలో వేయాలి. మీడియం మంట మీద చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి తీసి టిష్యు పేపర్ మీద వేసి పెట్టాలి.

తర్వాత మరో పాన్‌లో రెండు చెంచాలా నూనె వేసి, వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లి వేయాలి. ఇందుకు పచ్చిమిర్చి కూడా జతచేసి, దోరగా వేపుకోవాలి. ఇందులోనే సోయాసాస్, టమోటా కెచప్, అజినమోటా వేసి మరో నిమిషం పాటు వేపాలి.

కొత్తిమీర తరుగు వేసిమిక్స్ చేసి, అరకప్పు నీళ్ళు పోయాలి. అలాగే డీప్ ఫ్రై చేసుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. స్టౌను సిమ్‌లో ఉంచి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుని.. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుని దించేస్తే చికెన్ మంచూరియన్ రెడీ.దీనిపై మరింత చదవండి :