చైనీస్ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలి!
పిజ్జాలంటే పిల్లలు భలే ఇష్టపడి తింటారు. ఇవి పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని, ఊబకాయానికి దారితీస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. అందుకే పిజ్జా స్టోర్లలో అమ్మే పిజ్జాలను పిల్లలకు కొనిపెట్టడం కంటే.. ఇంట్లోనే చైనీస్ బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో ట్రై చేద్దాం.
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసులు... కావలసినన్ని
ఉప్మా రవ్వ... ఒక కప్పు
పాలు... 1/2 కప్పు
టొమాటో... ఒకటి
పచ్చిమిర్చి... రెండు
ఉల్లిపాయ... ఒకటి
క్యారెట్ తురుము... ఒక టేబుల్ స్పూన్
కాప్సికం... ఒక టేబుల్ స్పూన్
కొత్తిమిర... రెండు టేబుల్ స్పూన్
టోమాటో సాస్... ఒక టీస్పూన్
చిల్లీ సాస్... మూడు టేబుల్ స్పూన్
చీజ్... 50 గ్రాములు
నూనె... ఐదు టేబుల్ స్పూన్
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
బ్రెడ్ పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలన్నింటిలో చీజ్, చిల్లీసాస్ తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ కలుపుకోవాలి. ఒక్కో బ్రెడ్ స్లైసుపై చిల్లీ సాస్ పూసి పైన అన్ని పదార్థాలతో కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని రెండు స్పూన్లు వేసి బ్రెడ్ మొత్తానికి సమానంగా పూయాలి. తరువాత తురిమిన చీజ్ చల్లి పెనంపై కొద్దిగా నూనె లేదా వెన్న వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే వేడి వేడి బ్రెడ్ పీసులతో తయారైన పిజ్జా సిద్ధమైనట్లే...!