మంగళవారం, 20 జనవరి 2026
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2014 (12:34 IST)

దోసెల పిండి పులుపెక్కితే..?

దోసెల పిండి ఎక్కువగా పులిసి పోతే ఒక భాగం పిండికి, పావు భాగం రవ్వతో ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి ఓ తిప్పు తిప్పి పిండిలో వేసి కలిపి దోసెలుగా వేస్తే దోసెలు చాలా రుచిగా ఉంటాయి. 
 
కాకరకాయలతో పులుసు
కాకరకాయలు ఎక్కువగా ఉంటే వాటిని సన్నగా తరిగి ఎండబెట్టి దాచిపెట్టండి. మీరు కారపులుసు పెట్టే సమయంలో వీటిని వేస్తే చాలా రుచిగా ఉంటుంది. 
 
కొబ్బరి పాలతో సలాడ్
క్యారెట్, టమోటా, ఉల్లిపాయలతో సలాడ్ చేసే సమయంలో ఇందులో పెరుగుకు బదులుగా రెండు చెంచాల కొబ్బరి పాలను వేసి తయారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా నోటి పుళ్లు, కడుపులో అల్సర్లు తగ్గుతాయి.
 
చేమదుంపలు ఉడికేందుకు
చేమదుంపలు త్వరగా ఉడకాలంటే అవి ఉడికించే ముందు పాత్రను స్టవ్‌పై పెట్టి అందులో కాస్త ఉప్పు వేసి అది చిటపటలాడాక అందులో చేమదుంపలను వేయండి.