చేమదుంపలను ఉడికించిన తర్వాత పైనున్న తోలును తీసేందుకు ఇబ్బంది పడుతున్నారా? ఇదిగోండి చిన్ని చిట్కా. చేమదుంపల్ని ఉడికించి.. ఫ్రిజ్‌లో అరగంట పాటు వుంచి.. ఆపై తోలు తీసి కట్ చేస్తే జిగురు పోతుంది. అలాగే పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు గోరువెచ్చని వేడి నీటితో పాటు పాలను చేర్చుకుంటే పూరీలు మృదువుగా వుంటాయి. కోడిగుడ్డును ఉడికించేటప్పుడు నీటితో పాటు రెండు డ్రాప్‌ల వెనిగర్ చేర్చితే, కోడిగుడ్లు పగులవు. ...