బియ్యం పురుగు పట్టకుండా...?

Last Updated: శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (15:38 IST)
ఉప్పు సీసాలో ఒక స్పూన్ మొక్కజొన్న పిండి వేస్తే ఉప్పు తడిబారకుండా.. ముద్ద ముద్దగా అవకుండా ఉంటుంది. పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే.. చిన్న ఇంగువ ముక్కను నిప్పుమీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట తరువాత జాడీలో నుండి ఇంగువ ముక్కను తీసేసి ఆ తరువాత పచ్చడి వేయాలి.

బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే.. డబ్బాలో ఎండు వేపాకులు గానీ, ఎండు మిరపకాయలు గానీ వేయాలి. కూరల్లో పసుపు ఎక్కువైనట్లుగా అనిపిస్తే... తెల్లని బట్టముక్కని కూర ఉడుకుతుండగా, కూరలో వేస్తే ఎక్కువైన పసుపుని ఆ బట్ట పీల్చుకుంటుంది.

పనీర్‌ను బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇలా నిల్వచేసిన దాన్ని పదిహేను రోజులవరకు వాడుకోవచ్చు. రెడీమేడ్ పనీర్‌ను ప్యాక్ ఓపెస్ చేసిన తరువత వారంలోపే వాడేయడం మంచిది.దీనిపై మరింత చదవండి :