శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (08:21 IST)

ఏపీలో ఒమిక్రాన్ దూకుడు.. ఐదో స్థానంలో తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రోజు ఏకంగా పది ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు... కొత్త ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతున్నట్టు గుబులు రేకెత్తిస్తుంది. ముఖ్యంగా, ఒకే రోజు ఏకంగా 10 కేసులు వెలుగు చూడటం ఇపుడు అధికారుల్లో గుబులు పుట్టిస్తుంది. 
 
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు ఈ నెల 12వ తేదీన వెలుగు చూసింది. ఆ తర్వాత గత 17 రోజుల్లో ఈ కేసుల సంఖ్య 16కు చేరుకుంది. అయితే, ఒకేఒక్క రోజు ఏకంగా 10 కేసులు నమోదు కావడం ఈ వైరస్ తీవ్రతను చూసిస్తోంది. ఈ పది మంది బాధితుల్లో ఏడుగురు విదేశాల నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. మరో ముగ్గురు వీరి కాంటాక్ట్ కేసులుగా అధికారులు గుర్తించారు. 
 
ఐదో స్థానంలో తెలంగాణ
మరోవైపు, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఒమిక్రాన్ కేసుల్లో దేశంలోనే ఐదో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్రలు పోటీపడుతున్నాయి. ఇపుడు తెలంగాణలో కూడా ఆ స్థాయిలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. బుధవారం ఒక్క రోజే ఏకంగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఇందులో ఒకరు ల్యాబ్ టెక్నీషియన్, ఓ గర్భిణి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తదితరులు ఉన్నారు.