శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 16 మే 2020 (17:55 IST)

మరో 15 మంది రోహిణీ జైలు ఖైదీలకు కరోనా

ఢిల్లీలోని రోహిణీ జైలులో మరో 15మందికి కరోనా సోకింది. దీంతో కరోనా సోకిన ఖైదీల సంఖ్య 16కు చేరుకుంది. మూడు రోజుల క్రితం ఒక ఖైదీకి కరోనా సోకడంతో సిబ్బందికి, 19 మంది ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

వీరిలో 15మంది ఖైదీలకు, జైలు వార్డెన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని అన్నారు. అయితే ఈ 16మందిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేవని, వీరిని ప్రత్యేక గదుల్లోకి క్వారంటైన్‌ నిమిత్తం తరలించినట్లు తెలిపారు.

ఇతర సిబ్బందిని కూడా హోమ్‌ క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. ఈ నెల 11 సర్జరీ నిమిత్తం డిడియు ఆస్పత్రికి తరలించిన 28 ఏళ్ల ఖైదీకి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అనంతరం అతనిని చికిత్స నిమిత్తం ఎల్‌ఎన్‌జెపి ఆస్పత్రికి తరలించారు.