శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:35 IST)

తెలంగాణలో కరోనావైరస్ కొత్త కేసులు 1,378

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,378  పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1107కి చేరింది.
 
ఆదివారం 1,932 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,87,211కి చేరింది. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,56,431గా వుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,673 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,054 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
 
గడిచిన 24 గంటల్లో 35,465మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 28,86,334 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మరణాల శాతం 0.59గా ఉందని వివరించింది.