ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2020 (13:00 IST)

కోవిడ్ పెరుగుదలలో ఏపీ అగ్రస్థానం, ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు జగన్? దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్ కరోనావైరస్ కేసుల పెరుగుదలలో అగ్ర స్థానంలో ఉందని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీలో కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయని, ప్రభుత్వం ఖర్చు చేసామని చెబుతున్న నిధులను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో తెలియడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
నిన్న 10,128 కేసులు, 77మరణాలు కోవిడ్ కేసులు నమోదవడాన్ని చూస్తే, పెరుగుదలలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా యాక్టివ్ కేసులలో రెండవ స్థానం, మరణాల విషయంలో అగ్రభాగం.
 
కరోనా కోసం మీరు ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు? కోవిడ్‍ను ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారో చెప్పండని దేవినేని ఉమ జగన్‌ను నిలదీసారు. ఈ సందర్భంగా పలు పత్రికలలో వచ్చిన వార్తలను ఆయన జత చేశారు.