బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (12:03 IST)

చైనాలో కరోనా-లాక్‌డౌన్‌లో ఇరుక్కున్న 40కోట్ల మంది

corona
చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వైరస్‌ వ్యాప్తితో షాంఘైతోపాటు పలు ముఖ్య నగరాలలో పూర్తిగా లాక్‌డౌన్‌ విధించారు. ప్రస్తుతం ఆ దేశంలో 40 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఇరుక్కున్నారు.
 
చైనాలోని వాణిజ్యనగరమైన గువాన్‌ఝౌలో పాఠశాలలను మూసేశారు. నిన్నమొన్నటి వరకు కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న జిలిన్ ప్రావిన్స్‌తోపాటు సుజౌ, టాంగ్‌షాన్ వంటి ప్రావిన్సుల్లో కరోనా వ్యాప్తి కొంత అదుపులోకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. కాగా,ప్రస్తుతం 100 ప్రధాన నగరాల్లోని 87 చోట్ల కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి.