1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (11:20 IST)

అందుబాటులోకి కార్బొవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్

corbevax
కార్బొవాక్స్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది. 18 ఏళ్లు అంతకంటే పైబడ్డవారికి మాత్రమే అప్రూవల్ దొరికింది. కొవాగ్జిన్, కొవీషీల్డ్ వేసుకున్న వారు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద కార్బొవ్యాక్స్ బూస్టర్ షాట్ తీసుకోవాలి. ప్రైమరీ వ్యాక్సిన్ డోసులైన కొవాగ్జిన్, కొవీషీల్డ్‌లు వేసుకున్న ఆరు నెలల తర్వాతే దీనిని తీసుకోవాలి.
 
ఎమర్జెన్సీ యూజ్ ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రూవల్ ఇచ్చింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇమ్యూనైజేషన్ దీనిని రికమెండ్ చేస్తుంది.
 
"డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి హెటరాజస్ వ్యాక్సిన్‌కు ఎమర్జెన్సీ యూజ్ కింద అనుమతి వచ్చింది. 2022 జూన్ 4 నాటికల్లా 18ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసుగా దీనిని వినియోగించుకోవచ్చు" అని అఫీషియల్ స్టేట్మెంట్ విడుదలైంది.