ఏపీలో కరోనా కొత్త కేసులు- 6,151 మంది, మృతులు- 55 మంది
రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,02,712 శాంపిళ్లను పరీక్షించగా 6,151 మంది కోవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. కోవిడ్ కారణంగా చిత్తూరులో 12 మంది, ప్రకాశం ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఐదుగురు, అనంతపురంలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో నలుగురు, వైఎస్సార్ కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరణించారు.
గడిచిన 24 గంటల్లో 7,728 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,30,007 పాజిటివ్ కేసులకు గాను 17,48,009 మంది డిశ్చార్జ్ కాగా 12,167 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 69,831.