ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : గురువారం, 1 జులై 2021 (21:42 IST)

కరోనా వ్యాక్సిన్ వికటించి యువకుడు మృతి, పెళ్లింట విషాదం

మూడు రోజుల క్రితం తమ్ముడు వివాహం జరిగింది. విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామంలో పెళ్లింట విషాదం నెలకొంది. కరోనా విలయతాండవం కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవీ సీల్డ్ టీ కా వికటించి వుగ్గిన ఎల్లాజీ (33) అనే యువకుడు గురువారం మృతి చెందడంతో ఆ కుటుంబం లో తీవ్ర విషాదాన్ని నింపింది. 
 
వివరాల్లోకెళ్తే  సబ్బవరం మండలం ఎల్లుప్పి గ్రామానికి చెందిన ఉగ్గిన ఎల్లాజీ విజయనగరం జిల్లా కొత్తవలస లో ఓ ప్రైవేట్ కంపెనీలో కాంట్రాక్ట్ ఎంప్లాయ్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీ ఉద్యోగులందరికీ విశాఖపట్నంలోని సీతమ్మధారలో బుధవారం కరోనా నివారణకు కోవీషీల్డ్ టీకాలు వేస్తున్నారని సమాచారంతో వుగిన ఎల్లాజీ వ్యాక్సిన్ వేయించుకుని బుధవారం సాయంత్రం ఎల్లుప్పి లోని తన స్వగృహానికి చేరాడు.
 
అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఎల్లాజీ బుధవారం రాత్రి స్వల్పంగా జ్వరం బారిన పడ్డాడు. టీకాలు వేయించుకున్న వారికి సహజంగా జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటాయని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు సాధారణంగా తీసుకున్నారు.
 
అర్ధరాత్రివేళ వాంతులు విరేచనాలతో పాటు, బ్రీతింగ్ సమస్య ఎదురు కావడంతో  విశాఖపట్నం ఆసుపత్రికి తరలించేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా,108 అంబులెన్స్ లో విశాఖ తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. దీంతో  కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.
 
ఇదిలా ఉండగా ఎల్లాజీకి 2019లో వివాహం కాగా భార్య, ఏడాది కుమార్తె ఉన్నారు. మృతుని భార్య రోదించడంతో ఆమెను ఆపడం ఎవరి తరం కాలేదు. ఎల్లాజీ మృతిపై గ్రామ సర్పంచ్ ఉద్యాన నాయుడు మాట్లాడుతూ, ఎల్లాజీ మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.