శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (20:14 IST)

ఏపీలో కరోనా దూకుడు, కొత్తగా 8,702 పాజిటివ్ కేసులు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 77,492 శాంపిల్స్‌ను పరీక్షించగా 8,702 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు 10,712 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 72 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
చిత్తూరు 12, ప్రకాశం 10, కడప 7, గుంటూరు 6, కర్నూలు 6, నెల్లూరు 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, అనంతపురం 4, విశాఖపట్నం 4, పశ్చిమ గోదావరి 4, శ్రీకాకుళం 2, విజయనగరం జిల్లాలో 1 చొప్పున మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 6,01,462.
 
ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య5,177. వివిధ ఆస్పత్రుల్లో 88,197 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో 48,84,371 కరోనా శాంపిల్స్ పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 82,447, కర్నూలు జిల్లా 53,098, అనంతపురం జిల్లా 51,358, పశ్చిమగోదావరి జిల్లా 54,635, చిత్తూరు జిల్లా 52,421, విశాఖపట్నం జిల్లా 45,686, గుంటూరు జిల్లా 47,880, నెల్లూరులో 46,122, కడప38,325, ప్రకాశం జిల్లా 39,443 కేసులు నమోదయ్యాయి.