బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:36 IST)

న్యూయార్క్‌లో ప్రతి రెండున్నర నిమిషాలకు ఓ కరోనా రోగి మృతి

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం భయంతో వణికిపోతోంది. ఇప్పటికే అనేక దేశాలను సర్వనాశనం చేసిన ఈ వైరస్ మహమ్మారి దెబ్బకు ఇపుడు అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోంది. ముఖ్యంగా, న్యూయార్క్ మహానగరంలో మరింత భయానక పరిస్థితులు నెలకొనివున్నాయి. ఇక్కడ ప్రతి రెండున్నర నిమిషాలకు ఒక కరోనా రోగి ప్రాణాలు కోల్పోతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పూర్తి నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా పరిస్థితి విషమించి పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలను నిజం చేసేలా అమెరికాలో ప్రతి రోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 
 
ఇప్ప‌టికే అమెరికాలో క‌రోనా బాధితుల సంఖ్య 2.50 దాటిపోయింది. ఇక మరణాల సంఖ్య కూడా 8 వేలు మించిపోయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపుగా 60 వేల ప్రాణాల‌ను బ‌లిగొన్న ఈ మ‌హ‌మ్మారి.. అమెరికాలో శుక్రవారం ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఎంత‌లా అంటే న్యూయార్క్‌లో ప్ర‌తి రెండు నిమిషాల‌కు ఒక వ్య‌క్తి చనిపోతున్నాడు. అయితే అక్కడ పేషంట్లకు సరిపోయేన్ని వెంటిలేటర్లు లేకపోవడమే ప్రధాన కారణమని అక్క‌డి అధికారులు చెపుతున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లోనే కరోనా వల్ల చనిపోయిన వారిసంఖ్య త్యధికంగా నమోదైందని పేర్కొంటున్నారు.