బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (12:05 IST)

భారత్‌లో కొత్తగా 16,738 కేసులు_ 138 మంది మృతి

దేశంలో కరోనా తీవ్రత మరలా పెరుగుతుంది. కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తిరిగి ప్రభుత్వాలపైన, ఆసుపత్రులపైనా ఒత్తిడి పెరగడం మొదలైంది. తాజాగా, ఇండియాలో కొత్తగా 16,738 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914 కి చేరింది. 
 
ఇందులో 1,07,38,501 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,51,708 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 138 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,56,705కి చేరింది. ఇప్పటివరకు 1,26,71,163మందికి వ్యాక్సిన్ వేసుకున్నారు.