గర్భస్థ శిశువులకు కరోనా వైరస్ సోకుతుందా..?
షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభించిన రోజు నుంచి గర్భస్థ శిశువులకు వైరస్ సోకుతుందా..? లేదా..? అనే అంశం గురించి విసృతంగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇటలీ శాస్త్రవేత్తలు గర్భిణుల నుంచి గర్భస్థ శిశువులకు వైరస్ సంక్రమించే వీలుందని చెప్తున్నారు.
తాజాగా కరోనా సోకిన 31 మందిపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో కాన్పు అయిన వీళ్ల బొడ్డు రక్తం, స్తన్యంలలో వైరస్ ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయితే మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని... వైరస్ సోకుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. న్యూయార్క్‌లోని పరిశోధకులు మాత్రం తల్లి నుంచి బిడ్డాకు కరోనా వైరస్ చాలా అరుదుగా జరుగుతుందని అందువల్ల భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.