శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (19:07 IST)

ఆంధ్రాలో నెమ్మదిస్తున్న కరోనా వైరస్...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నెమ్మదిస్తోంది. దీంతో రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల్లో కూడా తగ్గుముఖం కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 33 మంది కరోనాతో మృతి చెందగా, 5,795 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 970, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 123 కేసులు గుర్తించారు. అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా 6,046 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
ఇకపోతే, మొత్తంగా చూస్తే, ఇప్పటివరకు ఏపీలో మొత్తం 7,29,307 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,72,479 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 50,776 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,052కి పెరిగింది.
 
ఇక ఆయా జిల్లాల్లో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురంలో 1214, చిత్తూరులో 6534, ఈస్ట్ గోదావరిలో 9020, గుంటూరులో 5271, కడపలో 3209, కృష్ణలో 2707, కర్నూలులో 1594, నెల్లూరులో 2429, ప్రకాశంలో 4922, శ్రీకాకుళంలో 2668, విశాఖపట్టణంలో 3069, విజయనగరంలో 2078, వెస్ట్ గోదావరిలో 6011 చొప్పున మొత్తం 50766 కేసులు ఉన్నాయి.