1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 మే 2021 (19:42 IST)

ఆంధ్రా - తెలంగాణాల్లో పాజిటివ్ కేసులు.. మరణాలు ఎన్ని?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైరస్ వ్యాప్తి ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో తాజాగా 23,160 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ సోకి 106 మంది చ‌నిపోయారు. 
 
తాజా కేసుల‌తో క‌లుపుకుని ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,98,532కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,09,736. క‌రోనా ఇప్ప‌టివ‌ర‌కు ఏపీలో 9,686 మంది మృత్యువాత‌ప‌డ్డారు.
 
జిల్లాల వారీగా తాజాగా న‌మోదైన కొవిడ్ మ‌ర‌ణాల వివ‌రాలిలా ఉన్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 17 మంది మృతిచెంద‌గా, నెల్లూరు, విశాఖ‌ప‌ట్నంలో 11 మంది చొప్పున‌, తూర్పుగోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో 9 మంది చొప్పున‌, అనంత‌ర‌పురం, కృష్ణా, చిత్తూరు, శ్రీ‌కాకుళం జిల్లాల్లో 8 మంది చొప్పున‌, గుంటూరులో ఏడుగురు, క‌ర్నూలులో ఐదుగురు, ప్ర‌కాశంలో న‌లుగురు, క‌డ‌ప‌లో ఒక్క‌రు చొప్పున మ‌ర‌ణించారు.
 
అదేవిధంగా తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. బుధవారం కొత్త‌గా 3,837 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 25 మంది చ‌నిపోయారు. 4,976 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
రాష్ట్రంలో ప్ర‌స్తుతం 46,946 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ 71,070 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 594 పాజిటివ్ కేసులు, రంగారెడ్డిలో 265, మేడ్చ‌ల్ జిల్లాలో 239 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.