శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (14:21 IST)

దేశంలో మళ్లీ బుసలు కొడుతున్న కరోనా వైరస్

Covid-19
దేశంలో కరోనా వైరస్ మళ్లీ బుసలు కొడుతోంది. మన దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలను దాటేశాయి. గత రెండు రోజులుగా నమోదైన కేసులతో పోల్చుకుంటే ఈ కేసు పెరుగదలతో చాలా వృద్ధి కనిపించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ మేరకు గడిచిన 24 గంటల్లో 20,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అంతకుముందు రోజు మాత్రం 15 వేలుగా ఉన్న ఈ కేసులో ఒక్కసారిగా ఐదు వేలు పెరిగిపోయాయి. అలాగే, ఈ వైరస్ నుంచి 18517 మంది కోలుకున్నారు. మరో 40 మంది చనిపోయారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,654గా ఉంది. అలాగే, యూరప్ వంటి ప్రపంచ దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంది. దీంతో ఇక్కడ లాక్డౌన్ విధించే దిశగా పాలకులు ఆలోచనలు ఉన్నాయి. 
 
మరోవైపు, దేశంలో మంకీపాక్స్ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కేరళలో రెండు కేసులు వెలుగు చూశాయి. అలాగే, విజయవాడలో మరో కేసు వెలుగు చూసినట్టు వార్తలు వచ్చినప్పటికీ, ఈ వార్తల్లో నిజం లేదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తేల్చాయి.